Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్లలో రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:36 AM పల్నాడు General
పిడుగురాళ్లలో రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి - Udayam
నడికుడి-పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ల మధ్య రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల 18న రైలు నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తొలుత గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...