వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు మృతి చెందిన కాకర్ల మాల్యాద్రి మృతదేహానికి రాష్ట్ర టీడీపీ విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి నివాళులర్పించారు. బోట్లగూడూరు పంచాయతీ రంగసామిపాకల గ్రామానికి చెందిన మాల్యాద్రి సోమవారం పొలంలో గొర్రెలు కాస్తుండగా పిడుగుపాటుకు మృతిచెందారు.
కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభాకర్ చౌదరి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

