వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం ఎక్కవాయిపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల యాదమ్మ (54) బుధవారం కూలి పనికి వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందారు.
పని ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
యాదమ్మకు ముగ్గురు పిల్లలు ఉండగా, అందరికీ వివాహాలు జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

