వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం రాచర్ల గ్రామంలో గురువారం పిడుగు పడింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్న సమయలో ఒక్కసారిగా పిడుగుపాట సంభవించింది. యంగమూట్ల తోట దగ్గర కుంటెమ్మ గుడి పక్కన జరిగిన ఈ ఘటన లో బజారప్ప, రామకృష్ణుడకు చెందిన ఐదు మేకలు చనిపోయాయి.
మేకలు మృతి చెందడంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Comments
Loading comments...

