వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రైడే.. డ్రై డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా మలేరియా అధికారి నాగార్జున రావు తెలిపారు. శుక్రవారం పర్చూరు మండలంలోని పలు గ్రామాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.
దోమల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. నీరు నిలిచిన ప్రాంతాలలో దోమల లార్వా నివారణకు మందు పిచికారి చేయాలన్నారు. కీటక జనిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Comments
Loading comments...

