వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తెలుగు సినీ నిర్మాతలు కలిశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల నష్టాలు, పెరుగుతున్న నిర్వహణ వ్యయం, విద్యుత్ ఛార్జీల భారం వంటి చిత్ర పరిశ్రమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. థియేటర్లను ఆదుకునేందుకు ప్రత్యేక పాలసీ తేవాలని కోరారు.
నిర్మాతల సమస్యలపై పవన్ సానుకూలంగా స్పందించారు. సినీ రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ను ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

