వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతున్నది. ఆదివారం ఎగువ నుంచి 1,16,600 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. బరాజ్ మొత్తం 59 గేట్లు ఉండగా, 11 గేట్లను పైకెత్తి 1,08,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం బరాజ్ వద్ద గోదావరి నీటిమట్టం 77.70 మీటర్లకు చేరింది.
Comments
Loading comments...

