వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్దుర్తి మండలం ధర్మారానికి చెందిన బొడ్డు కృష్ణ (50) ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు.
దీంతో కుమారుడు దుర్గాప్రసాద్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. కృష్ణ ఆచూకీ తెలిసిన వారు 8712657890 నంబర్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ కర్ణాకర్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

