వార్తలకు తిరిగి వెళ్లండి

దెందులూరు మండలానికి చెందిన పసల దుర్గారావు (36)ను మంగళవారం రాత్రి గుండుగొలను సెంటర్ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు.
ప్రమాదంలో మృతదేహం ఛిద్రమైంది. దెందులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

