Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంభంలో విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 12:38 PM మార్కాపురంGeneral
కంభంలో విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి - Udayam
కంభం మండలం జంగంగుంట్లలో సోమవారం విద్యుత్‌ షాక్‌తో ప్రైవేట్‌ హెల్పర్‌ మృతి చెందాడు. గ్రామంలో విద్యుత్‌ మరమ్మతులు చేస్తుండగా లైన్‌మ్యాన్‌ కింద పనిచేస్తున్న హెల్పర్‌కు విద్యుత్‌ షాక్‌ తగిలింది. హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న విద్యుత్‌ శాఖ, పోలీసు అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...