Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుమూరుకు పెన్షన్‌ నిధులు మంజూరు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:54 AM చిత్తూరుGeneral
పెనుమూరుకు పెన్షన్‌ నిధులు మంజూరు - Udayam
పెనుమూరు మండలానికి అక్టోబర్‌ నెల ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల కోసం రూ.2.96 కోట్ల నగదు మంజూరైంది. మండలంలోని 14 సచివాలయాల పరిధిలో 6,968 మంది అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు చార్వగానిపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. థామస్‌ పాల్గొంటారని ఇన్‌చార్జి ఎంపీడీవో ఢిల్లీబాబు తెలిపారు.

Comments

G
Loading comments...