వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండలో 70 మంది లబ్ధిదారులకు రూ.31.43 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి సవిత బుధవారం పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తోందని తెలిపారు.
గత 28 నెలల్లో పెనుకొండ నియోజకవర్గంలో 1,461 మందికి రూ.15.75 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి వెల్లడించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

