Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గొంతులో బాటిల్‌ మూత ఇరుక్కొని పసికందు మృతి

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 5:47 PM హైదరాబాద్General
గొంతులో బాటిల్‌ మూత ఇరుక్కొని పసికందు మృతి - Udayam
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో బాటిల్‌ మూత గొంతులో ఇరుక్కొని తొమ్మిది నెలల బాలుడు ఆర్యవర్ధన్‌ మృతి చెందాడు. ఈ నెల 12న ఇంట్లో ఆడుకుంటూ వాటర్‌ బాటిల్‌ను నోట్లో పెట్టుకోగా మూత గొంతులో ఇరుక్కుంది. దాన్ని తీసే క్రమంలో గొంతుకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

Comments

G
Loading comments...