Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో సెక్రటేరియట్‌కు పిలుపు

Follow Udayam on Google
Harika Aug 26, 2026 12:50 PM జనగామ General
చలో సెక్రటేరియట్‌కు పిలుపు - Udayam
జనగామ ఆర్టీసీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలని, రోస్టర్‌ను సవరించాలని బుట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆగస్టు 31న నిర్వహించే చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి జనగామ జిల్లా నుంచి మాలలు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...