వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామపంచాయతీలో కొత్త పింఛన్లకు దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి బబిత తెలిపారు. ఇప్పటివరకు 87 మంది దరఖాస్తు చేసుకోగా.. 47 మంది వితంతువులు, 29 మంది వికలాంగులు, 11 మంది ఒంటరి మహిళలు ఉన్నారు.
అర్హులు గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 15 తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని తెలిపారు.
Comments
Loading comments...

