వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో సీపీ గౌష్ ఆలం పెండింగ్ కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రెండేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, గడువులోగా చార్జ్ షీట్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు. సైబర్ మ్యూల్ ఖాతాలు, రౌడీ షీటర్లపై కఠిన నిఘా ఉంచాలని, దుర్గామాత ఉత్సవాలకు భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

