Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి ఇష్టం లేదంటూ వాట్సాప్ మెసేజ్.. యువతి అదృశ్యం.

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 10:36 AM మేడ్చల్ మల్కాజిగిరి General
పెళ్లి ఇష్టం లేదంటూ వాట్సాప్ మెసేజ్.. యువతి అదృశ్యం. - Udayam
మెడ్చల్: తనకు పెళ్లి ఇష్టం లేదంటూ సోదరుడికి వాట్సాప్ సందేశం పంపిన ఓ యువతి అదృశ్యమైన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవోదయ నగర్‌కు చెందిన 24 ఏళ్ల యువతి డెంటల్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. "తనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే ఇంటి నుంచి వెళ్తున్నానని" సోదరుడికి వాట్సాప్ మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నిన్న పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ సభ్యులు ఆమె క్షేమంగా తిరిగి రావాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...