వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : అన్నోజిగూడ సంస్కృతి టౌన్‌షిప్‌లో పేకాట స్థావరంపై SOT ఉప్పల్ జోన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి మూడు సెట్ల ప్లేయింగ్ కార్డులు, ఆరు స్మార్ట్ ఫోన్లు, రూ.89,980 నగదును స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన పోలీసులు, పట్టుబడిన ఆరుగురిని పోచారం పోలీసులకు అప్పగించారు.
Comments
Loading comments...

