వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం మండలం మార్దండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ సాయిలు ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను స్వయంగా అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని,
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు మరింత నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయని సర్పంచ్ సాయిలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Loading comments...

