Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు మెరుగైన వైద్య సేవలు

Follow Udayam on Google
p.g.murthy Sep 05, 2026 5:07 PM మంచిర్యాలGeneral
పేదలకు మెరుగైన వైద్య సేవలు - Udayam
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందు నాయక్ అన్నారు. జన్నారం మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం సహాయనిధి చెక్కులను శనివారం వారు పంపిణీ చేశారు. పేదల వెంట కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మంద రాజేష్ ఉన్నారు.

Comments

G
Loading comments...