Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు భారంగా మారిన ఇసుక రవాణా

Follow Udayam on Google
p.g.murthy Aug 23, 2026 10:00 AM మంచిర్యాలGeneral
పేదలకు భారంగా మారిన ఇసుక రవాణా - Udayam
జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడం కష్టంగా మారింది. జన్నారం అభయారణ్యం పరిధిలో ఉండటంతో ఎకోజోన్ అమలు అవుతోంది. 9 కి.మీ వరకు ఇసుక సేకరణను అటవీ అధికారులు నిలిపివేశారు. పేదలు ఇంటిని కట్టుకోవాలంటే కాలేశ్వరం, తదితర ప్రాంతాల నుండి లారీలలో రూ.45 వేలు చెల్లించి ఇసుకను తీసుకు వస్తున్నారు. కళ్లెదుటే గోదావరి ఉన్న ఇసుక తీసుకోలేని పరిస్థితి ఉందని నిరుపేదలు వాపోయారు.

Comments

G
Loading comments...