వార్తలకు తిరిగి వెళ్లండి

పెదబయలు మండలం పెదకోడపల్లి పంచాయతీలో సెల్‌ఫోన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పంచాయతీ కేంద్రంలోని ఎయిర్‌టెల్ సెల్ టవర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిగ్నల్ నిలిచిపోయింది.
దీంతో సచివాలయంలో పౌర సేవలు అందించడంలో జాప్యం జరుగుతోంది. అత్యవసర సమయాల్లోనూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సెల్ సిగ్నల్ పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

