Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద చెరువు కాలువలో ఆటోమేటిక్ వడపోత యంత్రాలు

Follow Udayam on Google
B RAJESH Sep 17, 2026 8:32 PM విజయనగరంGeneral
పెద్ద చెరువు కాలువలో ఆటోమేటిక్ వడపోత యంత్రాలు - Udayam
నగరంలోని గంటస్తంభం నుంచి పెద్ద చెరువులోకి వెళ్లే ప్రధాన డ్రైనేజీ కాలువలో ఘన వ్యర్థాలను ఆటోమేటిక్ గా తొలగించేందుకు మెకానికల్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం కాలువను పరిశీలించిన ఆయన పనులపై అధికారులతో చర్చించారు. రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులతో కాలువలో పూడిక, చెత్త సమస్య తగ్గడంతో పాటు పెద్ద చెరువు కాలుష్యాన్ని నియంత్రించ వచ్చన్నారు.

Comments

G
Loading comments...