వార్తలకు తిరిగి వెళ్లండి

పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ పరిధి సీమకొండలో ఏళ్లుగా పాఠశాల భవనం లేదు. దీంతో సుమారు 15 మంది విద్యార్థులు ప్రతిరోజూ 2 కి.మీ కాలినడకన గుల్లెలులోని ఎంపీపీ పాఠశాలకు వెళ్తున్నారు.
వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సీమకొండలో పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...

