వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో 77.70 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మధు తండా శివారులోని ఓ మూసివేసిన షట్టర్ గదిలో అక్రమంగా నిల్వ చేసిన 152 బస్తాలను గుర్తించారు. వీటి విలువ రూ.2,71,950గా అధికారులు తెలిపారు. బియ్యాన్ని కేయూ పోలీసులకు అప్పగించగా, నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

