వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర మండల కేంద్రంలో పద్మశాలి సంఘ భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, సంఘ అధ్యక్షుడు ఓని స్వామి బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ తొలి ఉద్యమంలో బాపూజీ కీలక పాత్ర పోషించారని, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి అంకితమయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

