Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్ల మానసిక ఆరోగ్య కేసులో మెటాకు భారీ జరిమానా

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 07, 2026 11:53 AM జాతీయంGeneral
మైనర్ల మానసిక ఆరోగ్య కేసులో మెటాకు భారీ జరిమానా - Udayam
మైనర్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న కేసులో మెటా 567 మిలియన్ డాలర్లు చెల్లించాలని అమెరికాలోని న్యూమెక్సికో న్యాయస్థానం ఆదేశించింది. ఇందులో 420 మిలియన్ డాలర్లు బాధిత చిన్నారుల చికిత్సకు కేటాయించాలని పేర్కొంది. మిగిలిన నిధులను వచ్చే ఐదేళ్ల పాటు పరిశోధన,నిరోధక చర్యలు, వైద్య పరీక్షలకు వినియోగించాలని కోర్టు ఆదేశించింది. చిన్నారుల భద్రతకు సంబంధించిన మార్పులు చేపట్టాలని ప్రాసిక్యూటర్లు కోరినట్లు వెల్లడైంది.

Comments

G
Loading comments...