వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ బాంబే విద్యార్థి మృతి ఘటనపై విచారణ నేపథ్యంలో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాకు ఫ్యాకల్టీ ఫోరం మద్దతు తెలిపింది. ఆయనను సస్పెండ్ చేయలేదని, డీన్ బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించామని స్పష్టం చేసింది.
స్వతంత్ర విచారణ కోసమే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. తప్పుడు మీడియా కథనాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యార్థి మృతిపై విచారం తెలిపింది. విచారణలో న్యాయం పాటించాలని కోరింది.
Comments
Loading comments...

