వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేట–ఓడరేవు రహదారిలోని పసుమర్రు వద్ద సోమవారం కారు అదుపుతప్పి పొలాల్లోకి పల్టీలు కొట్టింది. అడ్డంగా వచ్చిన స్కూటర్‌ను తప్పించబోయి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులోని దంపతులు, ఆరేళ్ల బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

