Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ దేవాలయాలకు రహదారులపై పవన్‌ దృష్టి

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 9:08 PM అమరావతిGeneral
గ్రామీణ దేవాలయాలకు రహదారులపై పవన్‌ దృష్టి - Udayam
గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాలకు రహదారుల నిర్మాణంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దృష్టిసారించినట్లు జనసేన తెలిపింది. 100కు పైగా ప్రధాన క్షేత్రాలకు రూ.120 కోట్లతో 205 కిలోమీటర్ల మేర అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం జరుగుతోందని పేర్కొంది. ఐ.ఎస్‌.జగన్నాథపురం, అహోబిలం, వాడపల్లి కరకట్ట, అర్థగిరి, గంగమ్మ జాతర రోడ్లు ఈ జాబితాలో ఉన్నాయని తెలిపింది. త్వరలో పవన్‌ వీటిని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...