వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్రం జాషువా తన కవితల ద్వారా ప్రజల్లో దేశభక్తి, స్ఫూర్తిని నింపారని మంతెనవారిపాలెం శాఖ గ్రంథాలయ అధికారి తాటి విజయకుమార్ తెలిపారు. సోమవారం మంతెనవారిపాలెం గ్రంథాలయంలో జాషువా జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన రచనలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయని విజయకుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పిట్టలవానిపాలెం గ్రంథాలయ అధికారి పాల్గొన్నారు.
Comments
Loading comments...

