వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం జెండాగూడకు చెందిన చంద్రసేన్‌ను వంతెన లేక ఎడ్లబండిపై ఒర్రె దాటించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇచ్చినా అంబులెన్స్ ఒర్రె వద్దే ఆగిపోయింది.
అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోవడంతో కుటుంబసభ్యులు ఈ విధంగా రోగిని తరలించారు. గ్రామస్థులు వంతెన నిర్మించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని తెలిపారు.
Comments
Loading comments...

