వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో శనివారం 176 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పరేడ్‌ను వీక్షించారు.
SP డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ అభ్యర్థులకు జ్ఞాపికలు అందజేశారు.
Comments
Loading comments...

