Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారాదీప్‌ సముద్రంలో నౌకకు తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
Kiran Sep 29, 2026 11:51 AM జాతీయంGeneral
పారాదీప్‌ సమీపంలో 9 వేల మెట్రిక్‌ టన్నుల పామ్‌ ఆయిల్‌, 23 మంది సిబ్బందితో ఉన్న ‘ఎంటీ సీగల్‌ 9’ నౌక ప్రమాదంలో చిక్కుకుంది. ఐసీజీఎస్‌ విశ్వస్త్‌ సిబ్బంది నీటిని తొలగించి, దెబ్బతిన్న పైపులను సరిచేసి నౌకను స్థిరీకరించారు. కాలుష్య నియంత్రణ, పర్యవేక్షణ కోసం ఐసీజీ నౌకలను మోహరించారు. నౌకను టగ్‌తో పారాదీప్‌ వైపు తరలిస్తుండగా, పామ్‌ ఆయిల్‌ స్వల్ప ఆనవాళ్లు పూర్తిగా కనుమరుగైనట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...