Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైప్‌లైన్ మరమ్మతుల కోసం గొయ్యి.. ప్రమాద సూచికలు కరవు

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:26 PM హన్మకొండ General
పైప్‌లైన్ మరమ్మతుల కోసం గొయ్యి.. ప్రమాద సూచికలు కరవు - Udayam
కమలాపూర్ మండల కేంద్రంలోని హుజురాబాద్–పరకాల రహదారి పక్కన మిషన్ భగీరథ అధికారులు పైప్‌లైన్ మరమ్మతుల కోసం భారీ గొయ్యి తవ్వి వదిలేశారు. అక్కడ ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఈ మార్గంలో నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తూ, గొయ్యి తవ్విన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...