Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పైడిమడుగులో యూరియా, విద్యుత్‌పై రైతుల నిరసన

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:38 AM జగిత్యాలGeneral
పైడిమడుగులో యూరియా, విద్యుత్‌పై రైతుల నిరసన - Udayam
కోరుట్ల మండలం పైడిమడుగులో రైతులు శుక్రవారం సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. యూరియా యాప్‌ విధానాన్ని ఎత్తివేయాలని, వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది.

Comments

G
Loading comments...