వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేటలోని బృందావనం దుర్గాలమ్మ చెట్టు వద్ద శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలకు గురువారం ఉత్సవ కమిటీ సభ్యులు అంకురార్పణ చేశారు. ఈ నెల 11వ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయని చైర్మన్ ఆచంట దొర తెలిపారు.
శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

