Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల వద్ద మురుగు సమస్య

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 11:09 AM జగిత్యాలGeneral
పాఠశాల వద్ద మురుగు సమస్య - Udayam
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ ప్రభుత్వ పాఠశాల ప్రహరీ పక్కన మురికి కాలువ లేకపోవడంతో వ్యర్థ నీరు అక్కడే నిలిచిపోతోంది. దీంతో పరిసరాల్లో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు పెరుగుతున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని తెలిపారు. అధికారులు స్పందించి మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...