Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాసర్లపూడి తీర గ్రామాలకు ఊరట

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 11:34 AM కోనసీమGeneral
పాసర్లపూడి తీర గ్రామాలకు ఊరట - Udayam
పాసర్లపూడి ఏటిగట్టు దిగువన ఉన్న అప్పనపల్లి డైవర్షన్‌ రోడ్డు ముంపు నుంచి బయటపడింది. వరద నీరు పూర్తిగా తగ్గడంతో బుధవారం ఉదయం నుంచి వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. దీంతో అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాల ప్రజలకు ముంపు సమస్య నుంచి ఉపశమనం లభించింది. అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఇబ్బందులు తొలగడంతో తీర గ్రామాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

Comments

G
Loading comments...