వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆదివారం వినూత్నంగా జిల్లా ఆసుపత్రి వద్ద నోటిపై వేలు పెట్టుకుని మౌన నిరసన చేపట్టారు. తమను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమల, శిరీష, ఝాన్సీ, పృథ్వీ, నారాయణరావు, భారతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

