Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశుధ్య కూలీలతో జీవన్‌రెడ్డి ఆత్మీయ పలకరింపు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 22, 2026 12:38 PM జగిత్యాలGeneral
పారిశుధ్య కూలీలతో జీవన్‌రెడ్డి ఆత్మీయ పలకరింపు - Udayam
బైపాస్‌ రోడ్డులో పారిశుధ్య పనులు చేస్తున్న కూలీలను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు పాఠశాలకు ఆటోల్లో వెళ్లాల్సి రావడంతో రవాణా ఖర్చులు భారం అవుతున్నాయని కూలీలు తెలిపారు. స్పందించిన జీవన్‌రెడ్డి విద్యార్థుల వివరాలు సేకరించి, విద్యాశాఖ ద్వారా రవాణా భత్యం అందేలా జిల్లా కలెక్టర్‌, డీఈఓలతో మాట్లాడతా అన్నారు.

Comments

G
Loading comments...