Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాము కాటుకు వృద్ధుడు మృతి

Follow Udayam on Google
K Anuradha Sep 16, 2026 7:45 PM శ్రీకాకుళంGeneral
పాము కాటుకు వృద్ధుడు మృతి - Udayam
పొందూరు మండలం టోలాపి గ్రామంలో పాముకాటుతో కనుమూరు గణయ్య మృతిచెందాడు. ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా పరిస్థితి విసమించి చికిత్స పొందుతూ బుధవారం గణయ్య మృతిచెందినట్లు ఎస్‌ఐ జి.రాజేష్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

Comments

G
Loading comments...