Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలనలో ప్రజల సంతృప్తే ప్రధానం : కలెక్టర్

Follow Udayam on Google
RAGHU Aug 19, 2026 11:22 PM శ్రీకాకుళంGeneral
పాలనలో ప్రజల సంతృప్తే ప్రధానం : కలెక్టర్ - Udayam
పాలనలో ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలులో ప్రజా సానుకూల దృక్పథంతో పనిచేయాలని ఆదేశించారు. వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని సమీక్షించారు.

Comments

G
Loading comments...