Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండను ముంచెత్తిన వరదనీరు

Follow Udayam on Google
Ganga Sep 25, 2026 12:52 PM పార్వతీపురం మన్యంGeneral
తుఫాన్ ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాలకు శుక్రవారం పాలకొండలోని పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. జాబిలి హోటల్ వెనుక ఉన్న పలు గృహాలు జలదిగ్బంధం అయ్యాయి. అక్కడ గృహ వాసులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన ఫైర్ ఆఫీసర్ సర్వేశ్వరరావు తమ సిబ్బందితో ముంపు ప్రాంతంలోకి వెళ్లి ప్రజలను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...