వార్తలకు తిరిగి వెళ్లండి

వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులో బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేపట్టారు. యూఎఫ్‌బీయూ పిలుపుతో బ్యాంకులు మూతపడ్డాయి. ఎస్‌బీఐ వద్ద ఆందోళన నిర్వహించి పట్టణంలో ర్యాలీ చేపట్టారు.
ఐదు రోజుల పనివిధానం అమలు చేయడంతో పాటు పీఎల్‌ఐ, పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. బ్యాంకులు మూతపడటంతో ఖాతాదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...

