వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రెల్లిపేటలో ఏర్పాటు చేసిన 62 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
పర్యావరణ పరిరక్షణ సందేశంతో రూపొందించిన ఈ మహా గణపతికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వేదమంత్రోచ్ఛారణల నడుమ తొలిపూజ చేశారు. భక్తుల గణేష్ నామస్మరణలతో రెల్లిపేట పరిసరాలు మారుమోగాయి.
Comments
Loading comments...

