వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండలం పాలెంలో ఈ నెల 19న ఉదయం 9:00 గంటలకు కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు లింగాల మండల వ్యవసాయ అధికారి అనిల్ తెలిపారు.
రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానం, పంట యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తల నుండి అవగాహన పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. రైతుల సౌకర్యార్థం లింగాల నుండి పాలెం వరకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుందని, మండలంలోని రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

