వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరి మండలం పాలారం ఎస్సీ కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో ఐదు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో నీటి కోసం ఏకైక చేతిపంపు వద్ద ప్రజలు గంటల తరబడి బారులు తీరుతున్నారు.
ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే మార్చి నీటి సరఫరా పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. సమస్యను త్వరగా పరిష్కరిస్తామని సర్పంచ్ నరేష్ గౌడ్ తెలిపారు.
Comments
Loading comments...

