Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాశాఖ మంత్రి రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు

Follow Udayam on Google
మానస శర్మ Jul 23, 2026 3:26 PM జాతీయంGeneral
విద్యాశాఖ మంత్రి రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు - Udayam
నీట్ పేపర్ లీక్ ఉదంతానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని లోక్‌సభలో ప్రతిపక్షాలు భీష్మించుకూర్చున్నాయి. ఎంపీల నిరసనల మధ్య సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం చర్చ నుంచి పారిపోతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించగా, ప్రతిపక్షాలే చర్చను అడ్డుకుంటున్నాయని మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు.

Comments

G
Loading comments...