Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 20, 2026 12:07 PM జాతీయంGeneral
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన - Udayam
నీట్ పేపర్ లీకేజీ అంశంపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రభుత్వం లాఠీఛార్జ్ చేస్తోందని రాజ్యసభలో ఖర్గే ఆరోపించారు. లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభ ఆరంభంలోనే విపక్షాలు హంగామా చేయడం చెడు సంప్రదాయమని స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...